వెంకటగిరి నియోజకవర్గం లోని రాపూరు రాపూరు మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనమేరకు ఈరోజు రాపూర్ లోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాపూర్ బస్టాండ్ నుంచి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించి పెట్రోల్ బంకు వద్ద  ధర్నా నిర్వహించారు. పెట్రోల్ ధర పెరిగిపోవడంతో పెట్రోల్ ధరలు తగ్గించాలని లేదంటే భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని టిడిపి నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దందోల్ వెంకటేశ్వర్ రెడ్డి గారు మరియు పట్టణ అధ్యక్షులు షేక్ ముక్తార్ గారు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ గారు మాజీ వైస్ ఎంపీపీ పచ్చిగళ్ళ రత్నం గారు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూలేని ఈ విధంగా  ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది అన్ని  ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పెట్రోల్ మీద పదిహేను రూపాయలు, డీజల్ మీద16 రూపాయలు తగ్గించాలని అలా తగ్గించని ఎడల భారీ ఎత్తున నిరసనలు నిర్వహిస్తామని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో టీడీపీ రాపూరు మండల అధ్యక్షులు D.వెంకటేశ్వర్ రెడ్డి రాపూరు పట్టణ అధ్యక్షులు షేక్ ముక్తార్ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షుడు షేక్ అహ్మద్ రాపూరు మండల తెలుగు యువత అధ్యక్షుడు లక్కాకుల భాస్కర్ మండల నాయకులు రవీందర్ రెడ్డి షేక్ ఖాజావలి పంగిలి రమణయ్య గోవర్ధన్ రెడ్డి రమణారెడ్డి సాంబశివారెడ్డి పట్టణ నాయకులు సంకల పాపయ్య యాదవ్ సిగిచర్ల మహేష్ షేక్ కరీం షేక్ లతీఫ్ షేక్ సికిందర్ చింతగుంట రాజా బత్తల సాయికుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.