పొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని ఆయన విగ్రహానికి టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇంకా అది కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మేయర్ ,టిడిపి నెల్లూరు పార్లమెంట్  అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తెలుగువారందరూ ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలన్న లక్ష్యంతో పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసి రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు... ఆ మహనీయుడి త్యాగ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు.... పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం జిల్లా ప్రజలకు గర్వకారణమన్నారు... ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భువనేశ్వర్ ప్రసాద్, ధర్మవరం సుబ్బారావు, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు..