శ్రీ శబరి శ్రీరామక్షేత్రం దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మెన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరైయ్యారు. నెల్లూరు జిల్లాలోనే త్వరితగతిన ఆలయాలకు ట్రస్ట్ బోర్డు కమిటీలను నిర్మించిన ఘనత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కే దక్కుతుందని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలు మరియు ఆధ్యాత్మిక భావన కలిగిన వారికే శ్రీ శబరి శ్రీరామక్షేత్రం దేవస్థానం ట్రస్ట్ బోర్డు కమిటీ లో చోటు కల్పించామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కమిటీ సభ్యులకు సూచించారు.