ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలుస్వర్ణకెరటాలు:నాయుడుపేట  స్వామి వివేకానంద 159 జన్మదిన వేడుకలు బుధవారం నాయుడుపేట లక్ష్మణ నగర్ జంక్షన్ వద్ద లిఫ్ట్ స్వచ్చంధ సంస్థ అధ్యక్షులు,న్యాయవాది ఆశా.చెంచుకృష్ణయ్య ఆధ్వర్యంలో  ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎం. సోమశేఖర్, న్యాయవాది చదలవాడ. కుమార్, లిఫ్ట్ స్వచ్చంధ సంస్థ అధ్యక్షులు న్యాయవాది ఆశా చెంచుకృష్ణయ్య  మాట్లాడారు. భారత దేశ సంస్కృతి,సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత స్వామి వివేకానంద కే దక్కుతుందని కొనియాడారు.అనంతరం స్వామి వివేకానంద జీవిత సందేశం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో లైఫ్ట్ స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షులు కోడూరు.రమణయ్య,శివప్రసాద్  శర్మ,బిజెపి ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బొల్లకాయల.విజయ భాస్కర్,న్యాయవాది అంజయ్య, బి సి సంక్షేమ సంఘం నాయకులు జువ్వలపాటి.మస్తాన్,విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఇండ్ల శశి కిరణ్,ఆవుల వినోద్ కుమార్,గురు మస్తాన్,మాకాని రత్నయ్య,జె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.