భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానందుడు - టీడీపీ నేతలు
బుధవారం నెల్లూరు నగరంలోనీ ఎన్టీఆర్ భవన్ లో స్వామి వివేకానంద 159 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర  నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొని వచ్చిన స్వామి వివేకానందుడు అగ్రగామిగా నిలిచిపోతారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు....