అక్షర చైతన్యం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సూళ్లూరు పేట తాసిల్దార్ కె రవికుమార్.


నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట   మండల పరిధిలోని కోటపోలూరు పంచాయతీ లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో నేడు జరుగుతున్న అక్షర చైతన్యం పరీక్ష కేంద్రాన్ని సులూరుపేట తాసిల్దారు కె.రవికుమార్ పరిశీలించారు. అనంతరం పరీక్ష రాసే అభ్యర్థులు తో మాట్లాడి వారి పేర్లు రాయమని అడిగి వ్రాయించారు.తర్వాత లెక్కలు గుణింతాలు వారి చేత చెప్పించారు.ఇక్కడ జరుగుతున్న పరీక్ష పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.  నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిక్షరాలకు చాలా మంచిదని కొనియాడారు. త్వరలో పేపర్లను రుద్ధి రిజల్ట్స్ డిక్లర్ చేస్తామని తెలిపారు. జనవరి  26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా సర్టిఫికెట్లు అందజేస్తామని అన్నారు. అనంతరం పరీక్ష రాసే మహిళలతో మమేకమై వాళ్లకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమంలో కోటపోలూరు  సచివాలయ సిబ్బంది,పాఠశాల ఉపాధ్యాయులు, వీఆర్వో తదితరులు ఉన్నారు.