చిట్టమూరు, ఫిబ్రవరి 05, (రవికిరణాలు) : చిట్టమూరు మండలంలోని ఎంఈవో కార్యాలయం, ఎంపీపీ స్కూలును, గణపతి మార్కండేయ నాయుడు ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీ చేశారు. అక్కడ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సూచనలు సలహాలు అందించారు. ప్రతి ఒక్కరు ఏ గ్రేడ్ లో పాస్ అవ్వాలని అన్నారు. మధ్యాహ్నం భోజనం మెనూ సక్రమంగా అమలు చేయాలని అన్నారు. మెనూలో సమస్యలు తలెత్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. చిట్టమూరులో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను పరిశీలించారు. ఎమ్ఈఓ బీవీ కృష్ణయ్య మాట్లాడుతూ మండలంలో ఐదు రోజులపాటు ఆంగ్ల విద్య శిక్షణ కార్యక్రమం జరుగుతుందని వాటిని పరిశీలించడానికి జిల్లా విద్యాశాఖ అధికారి చిట్టమూరు మండలం కి వచ్చారని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి వాళ్ళకి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.