నెల్లూరు, జనవరి 18, (రవికిరణాలు) : గత సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలలో నిర్వహించిన పరీక్షలలో నారాయణ నర్సింగ్ సంస్థలు విద్యార్ధినులు ఉత్తమ ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా నారాయణ నర్సింగ్‌ సంస్ధల నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఇందిరా మాట్లాడుతూ ఏపి, తెలంగాణా రాష్ట్రాలలో నారాయణ నర్సింగ్‌ విద్యార్ధినులు ప్రతిభతో మంచి ర్యాంకులు సాధించారని అన్నారు. నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం వారు విద్యార్థులుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులకు బోధనా సిబ్బందికి వారి ఘనతను ప్రశంసిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం నారాయణ నర్సింగ్ విద్యాసంస్థలలో ఎమ్మెస్సీ, బి.ఎస్.సి, పి.బి.బి.ఎస్.సి కోర్సుల యందు ఉన్నత యూనివర్సిటీ ర్యాంకులు పొందుతున్నారని వివరించారు. నారాయణ నర్సింగ్‌ కళాశాల ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తింపు పొందినది దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ విద్యా సంస్థల్లో మొదటి పది స్థానాల్లో ఒకటిగా
నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ నారాయణ మార్గదర్శకత్వం సహాయ సహకారాలతో విద్యార్థినుల నైపుణ్యము, అత్యుత్తమ సామర్ధ్యము నాయకత్వ లక్షణాలు భవిష్యత్తులో నర్సింగ్ ప్రొఫెషన్ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి బోధనా సిబ్బంది కృషి ఉంటుందని తెలియజేశారు. మిస్ ఫ్లోరెన్స్ నైటింగేల్, మదర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్ పుట్టినరోజు సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ, జెసిఎన్, ఈ సంవత్సరాన్ని నర్స్ మిడ్ వైఫ్ రీ సంవత్సరంగా గుర్తింపబడినందుకు ఎంతో గర్విస్తున్నామన్నారు. నర్సింగ్ విద్యా సంస్థలు ఈ సంవత్సరము నర్సింగ్ చాలెంజిలో భాగంగా 200 నుండి 300ల midwivesలను మాతృ శిశు సంరక్షణ నైపుణ్యము
నాయకత్వ లక్షణాలలో శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు బోధనా సిబ్బందికి అభినందనలు విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఉన్నదున్నట్లు సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇందిరా డీన్, ఏజిఎమ్ సి.హెచ్ విజయభాస్కర్ రెడ్డి, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు అభినందనలు తెలియజేశారు.