నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి   
కోట, జనవరి 13, (రవికిరణాలు) : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పని చేయాలని ఆ పార్టీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన నివాసంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమిష్టిగా కృషిచేసి జడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచుల స్థానాలను కైవసం చేసుకోవాలని వారు పార్టీ కోసం కష్టపడి నీతి నిజాయితీ గా ఉన్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేసుకొని వారిని గెలిపించుకోవాలి అన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమన్నారు
అధికార వికేంద్రీకరణ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు మూడు రాజధానుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి,  దువ్వూరు భాస్కర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, చిట్టమూరు మండల వైసీపీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.