నెల్లూరు, ఫిబ్రవరి 01, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్, గాంధీ నగర్ లో వార్డు సచివాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మునిసిపల్ కమీషనర్ వి.వి.ఎస్.మూర్తి ప్రారంభించారు. దేశచరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని సచివాలయ వ్యవస్థతో ప్రజలకు అక్కడికక్కడే సమస్యలు పరిష్కార మార్గం సులువుఅవుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వాలంటీర్లు స్వయంగా లబ్ధిదారుల ఇంటికెళ్లి పింఛన్లు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమం చేపట్టారని పింఛన్లు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న ఫించన్ దారులకు డోర్ డెలివరీ విధానం ఎంతో ఆనందం కలిగిస్తోందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.