రాష్ట్ర స్థాయి జూనియర్ రగ్బీ విజేత నెల్లూరు.!


తూర్పుగోదావరి జిల్లాలో మూడురోజుల పాటు జరిగిన 6వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ (under-18) రగ్బీ పోటీల్లో నెల్లూరు జిల్లా బాలుర జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం గండిమొగ్గ గ్రామంలో మూడు రోజుల పాటు బాల, బాలికల రాష్ట్ర స్థాయి రగ్బీ జూనియర్స్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. బాలుర విభాగంలో ఈరోజు (బుధవారం) జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తూర్పుగోదావరి జిల్లా జట్టు పై నెల్లూరు జిల్లా జట్టు 26 పాయింట్లు సాధించి విజయఢంఖా మ్రోగించింది. రాష్ట్ర స్థాయి విజేతగా నికిచిన నెల్లూరు జిల్లా జట్టు క్రీడాకారులైన పీ మనోహర్, కార్తీక్, శశికుమార్, శ్రీకాంత్, షేక్ సిరాజ్, జశ్వంత్, సూర్య, మహిధర్, ఖాజా నవాజ్, నవీన్, మంజు, సాగర్, శ్రీనాథ్ లను తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడి వెంకట సతీష్ కుమార్ అభినందించి బహుమతి ప్రధానం చేశారు. నెల్లూరు జిల్లా జట్టు విజయానికి కారకులైన కోచ్ వంశీ, సతీష్, మరియు క్రీడాకారులను నెల్లూరు జిల్లా రగ్బీ అసోసియేషన్ సభ్యులు పొతురాజు రమేష్, జీ శ్రావణ్, ఎన్ శ్రీధర్ లు అభినందించారు.