నెల్లూరు నగరంలోని మూలపేట నందు గల శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ నూతన రాతి మండప నిర్మాణానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు శంఖుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి. రూప్ కుమార్ యాదవ్, నాయకులు గోగుల నాగరాజు,  శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.