పొదలకూరు : నెల్లూరు జిల్లా, పొదలకూరు జెడ్పి ఉన్నత పాఠశాల మైదానంలో జరుగు ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ మినిష్టర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆంధ్ర హాకీ అసోసియేషన్ అధ్యక్షులు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి చీఫ్ మినిస్టర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను పొదలకూరులో నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ క్రీడలను క్రీడాభివృద్ధి శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది.మూడు రోజులు పాటు ఈక్రీడలు నిర్వహించడం జరుగుతుంది.ముఖ్యమంత్రి గా 
జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత అత్యంత  ప్రాధాన్యత గల ఈ క్రీడలను సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అన్ని ఏర్పాట్లపై కూడా సమీక్ష నిర్వహించాం.ఇక్కడకు వచ్చే క్రీడాకారులకు అన్ని వసతి సదుపాయాలు కల్పించే విధంగా  ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.అన్ని శాఖల అధికారులను సమన్వయపరుచుకొని ఏర్పాట్లు చేస్తున్నాము.అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ క్రీడలను ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు.అందరూ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కాకాణి తెలియజేశారు.