కిడ్నీ వ్యాధుల నిర్ధారణలో నారాయణ నెఫ్రాలజీ విభాగానికి దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపుకలదు. సుమారు 12 సం||ల క్రితమే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ఊచపలి అనే చిన్న గ్రామంలో తరచూ మరణాలు సంభవిస్తుండగా, నారాయణ నెఫ్రాలజీ విభాగాధిపతి డా॥ అలా ప్రవీణ్ కుమార్ ఆగ్రామాన్ని సందర్శించి, ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, ఆ గ్రామంలో ఉన్న మంచినీటి సరఫరా పైపులో ఏర్పడిన సుద్ద కారణంగా ఆ గ్రామంలో 60 శాతం మందికి పైగా కిడ్నీ వ్యాధుల బారినపడడం, అనేక మంది. మరణించడం సంభవించింది. ఈ విషయం అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పరిష్కరించడం జరిగింది. అప్పటి నుండి సామాజిక భాద్యతతో ఎన్నో అవగాహన ర్యాలీలు, అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది...నారాయణ నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో 102కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసి దక్షిణ భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నది. అలాగే ప్రతి నెలా 2000 మందికి పైగా డయాలసిస్టు నిర్వహిస్తూ రోగి యొక్క కిడ్నీ భద్రతకు కృషి చేయడం జరిగింది. ఇటీవల ప్రపంచ తాజా అధ్యయనంలో ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధిగ్రస్తులు అవుతున్నారని, మరి మీ కిడ్నీ భద్రత ఎంత అనే నినాదంతో ఒక ప్రత్యేక కిడ్నీ హెల్త్ ప్యాకేజిని ప్రజల ముందుకు తీసుకురావడంతో మా పిలుపుకు ఎంతో స్పందన లభించింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో మార్చి 12వ తేదీన ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మార్చి 10వ తేది నుండి ఐదు రోజుల పాటు కిడ్నీ పరిరక్షణ కోసం సుమారు రూ||20/ఖరీదు చేసే వైద్య పరీక్షలను ప్యాకేజిగా రూపొందించి కేవలం రూ|| 799/-లకే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్‌తోపాటు RBS, Sr.creatinine, ultrasound Abdomen Scan, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ మైక్రో అల్బుమిన్, Sr.Electrolytes తదితర వైద్య పరీక్షలు ఈ ప్యాకేజిలో ఉన్నాయి. ఈ ప్యాకేజి కొరకు అపాయింట్మెంట్ కొరకు 7331170063 నెంబరును సంప్రదించవలయును. ఈ ప్యాకేజి 10-03-2010 నుండి 14-08-2020 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ కిడ్నీ చెకప్ కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ తోపాటు, ఆహార నియమాలు తెలియజేసేందుకు సీనియర్ న్యూట్రీషియన్లు కూడా అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నారాయణ హాస్పిటల్ సీఈవో డా॥ ఎస్.సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పత్రికా సమావేశంలో నారాయణ హాస్పిటల్ నెఫ్రాలజి విభాగాధిపతి డా॥ కొల్లా ప్రవీణ్ కుమార్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌ డా॥ బిజు రవీంద్రన్, నెఫ్రాలజిస్టు డా॥ కాకి వరపస్రాద రావు, డా॥ సాదినేని రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.