నెల్లూరు జిల్లా


సోమశిల జలాశయం విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గోలుపుతుంది

 

జిల్లా వరప్రసాధిని అయిన సోమశిల ప్రాజెక్టు విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గోలుపుతుంది.గతంలో అధికారులు కాంట్రాక్టర్ల చేత విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా పనులు చేపట్టేవారు.ఈ నేపథ్యంలో క్రొత్త గా వచ్చిన ప్రాజెక్టు ఈ ఈ ధనుంజయ్ ,డి.ఈ మహేశ్వర రెడ్డి ప్రాజెక్టు లోని విద్యుత్ దీపాలకు టెండర్లు పిలిపించడం జరిగింది. అయితే ఈ టెండర్ ను ప్రముఖ కాంట్రాక్టర్ల ,వై.సి.పి.నాయకులు ఎద్దల శ్రీనివాసులు రెడ్డి దక్కించుకున్నారు. ప్రాజెక్టు అధికారులు ఈ ఈ ,డి.ఈ శ్రద్ధతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ ,వై.సి.పి.నాయకులు ఎద్దల శ్రీనివాసులు రెడ్డి పనితీరు భేష్ అని పలువురు కొనియాడారు. చాలా కాలం తర్వాత సోమశిల జలాశయం విద్యుత్ దీపాల తో మిరుమిట్లు గోలుపు తుంటే జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.