అమరావతిలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఘన స్వాగతం
అమరావతి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జస్టిస్‌ ఎన్వీ రమణ అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాయపూడి వద్ద సీజేఐకి అమరావతి ఐకాస రైతులు అపూర్వ స్వాగతం పలికారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. జాతీయ జెండాలతో ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం హైకోర్టు ప్రాంగణంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులను న్యాయవాదులు సన్మానించారు.  సీజేఐ దంపతులను గజమాలతో హైకోర్టు సిబ్బంది సత్కరించారు