నెల్లూరులో  గల స్వర్ణ వేదిక  నందు శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చత్రపతి అవార్డు 2020 కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో రక్తదాన ఉద్యమకారులకు, రక్త దాతలకు మరియు  మోటివేటర్ లకు అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సిని నటుడు సుమన్ తల్వార్ పాల్గొన్నారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫెడరేషన్  రాష్ట్ర వ్యాప్తంగా  అనేక రక్తదాన శిబిరాలను  నిర్వహించి ద్వితీయ స్థానంలో నిలిచింది .ఈ కార్యక్రమంలో కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫెడరేషన్  రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోడివాక చందు సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా సిల్వర్ మెడల్ అందుకున్నారు.. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ పౌండేషన్ చైర్మన్ భాస్కర్ నాయుడు గారు, అమరావతి కృష్ణారెడ్డి , నీడ్స్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ శ్రీధర్ మరియు కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫెడరేషన్ సభ్యులు వెంకటాద్రి, రమేష్ కళ్యాణ్, శ్రీవేంద్ర మొదలగు సభ్యులు పాల్గొన్నారు