నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి 
నెల్లూరు, డిసెంబర్‌ 28, (రవికిరణాలు) : డిమాండ్ జిల్లాలోని చుక్కల భూముల సమస్య పరిష్కారం చూపమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. పేదలందరికీ ఇల్లు- రెవెన్యూ రికార్డుల నవీకరణ సమీక్ష సమావేశం కొత్త జడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజులతోపాటు ఎంపీలు బల్లి దుర్గాప్రసాద్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఏడాదికిపైగా చుక్కల భూముల గురించి అడుగుతూనే ఉన్నామని అయినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు మారుతూనే ఉన్న సమస్య మాత్రం అక్కడే ఉండి పోయిందని తెలిపారు. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారాన్ని చూపాలని కోరారు. దీనికి జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు స్పందించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.