రవికిరణాలు న్యూస్ తడ :    శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు శరన్నవరాత్రులు సందర్భముగా చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి సమక్షంలో కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో పవిత్ర కాళoగినది నుండి జలాలు తీసుకొనివచ్చి కలశములు స్థాపించి, కలశములకు ప్రత్యేక పూజలు నిర్వహించడమైనది. కలశ పూజ అనంతరం శ్రీ అమ్మవారికి అఖండ దీపం వెలిగించడం జరిగినది. కలశ స్థాపన ఉభయకర్త  శ్రీ బీరక  వెంకట రాంబాబు దంపతులు నిర్వహించారు. శ్రీ అమ్మవారికి చండీయాగం నిర్వహించుట జరిగినది ఉభయకర్తలుగా  శ్రీ పి.నాగేశ్వరరావు -శ్రీమతి రాధ దంపతులు విశాఖపట్నం వారు వ్యవహరించినారు. ఈ కార్యక్రమములో  ధర్మకర్తల మండలి సభ్యులు గోగులు తిరుపాలు, కర్లపూడి మదన్ మోహన్,  శ్రీమతి మద్దూరు శారద తదితరులు పాల్గొన్నారు.