అక్షర చైతన్యం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర సంచాలకులు షకీరా బేగం కావలి రూరల్ మండల పరిధిలో ఆమెమడుగు గ్రామ పంచాయతీలో జరుగుతున్న అక్షర చైతన్యం పరీక్ష కేంద్రాలను రాష్ట్ర సంచాలకులు షకీరా బేగం మరియు ఆర్ డి ఓ సీనా నాయక్ పరిశీలించారు పరీక్ష రాసే అభ్యర్థులు తో మాట్లాడారు వారి పేర్లు రాయమని అడిగి వ్రాయించారు లెక్కలు గుణింతాలు వారి చేత చెప్పించారు జరుగుతున్న పరీక్షల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కొనియాడారు త్వరలో పేపర్లు రుద్ది రిజల్ట్స్ డిక్లేర్ చేస్తామని తెలియజేసినారు జనవరి 26వ తారీఖున సర్టిఫికేట్లు అందజేస్తామని తెలియజేసినారు ఆర్డిఓ శీను నాయక్ పరీక్ష రాసే అభ్యర్థులు తో మమేకమై వాళ్ళని  ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట సుబ్బారావు మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ విస్తరణ అధికారి ఆదినారాయణ అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్వైజర్ నారాయణ పంచాయతీ కార్యదర్శి సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు