నెల్లూరు, జనవరి 22, (రవికిరణాలు) : భారత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు 2 రోజుల నెల్లూరు జిల్లా పర్యటనను పూర్తి చేసుకుని బుధవారం ఉదయం వెంకటాచలం రైల్వేస్టేషన్ నుండి ప్రత్యేక రైలులో చెన్నైకు బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.వి.శేషగిరి బాబు, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, డిఆర్ఓ మల్లికార్జున, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య ఆర్.సుదర్శన రావు , రిజిస్ట్రార్ అందె ప్రసాద్,  ప్రజాప్రతినిధులు తదితరులు ఉప రాష్ట్రపతికి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా వీడుకోలు పలికారు.