బూదనం టోల్ ప్లాజా వద్ద  అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయి పట్టివేత 

 6 మంది ని అదుపులోకి తీసుకున్న ఎస్ ఈ బి అధికారులు 

 గంజాయి వీలు 1.10 లక్షల రూపాయలు 

 జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలు మేరకు దాడులు 

 చిల్లకూరు మండలంలోని బూదనం టోల్ ప్లాజా వద్ద  అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని బుధవారం ఎస్ ఈ బి అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఈ బి జెడి శ్రీలక్ష్మి మాట్లాడుతూజిల్లా యస్.పి. విజయ రావు ఆదేశాల తన ఆధ్వర్యంలో బూదనం టోల్ ప్లాజా వద్ద 28 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది అని ఆమె తెలిపారు. గంజాయి విలువ సుమారు 1,10,000 ఉంటుంది అని తెలిపారు, గంజాయి ని తీసుకెళుతున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎస్ ఈ బి  పోలీసు అధికారులు,సిబ్బంది ఉన్నారు.