భూకుంభకోణం పై సింగిల్‌ జడ్జి విచారణ జరపాలి
వెంకటాచలం సత్రంలో దేవాదయశాఖకు చెందిన 399 ఎకరాలు ఆక్రమణకు వైసిపి ప్రభుత్వం కుట్రలు చేసింది. గత 30 సంవత్సరాలుగా సీతమ్మ చలివేంద్రం భూములు రక్షించుకునేందుకు దేవాదయఅధికారులు న్యాయపోరాటం చేసి కేసులు గెలిచినా పాలకులు అధికార బలంతో ఆబూములను వైసిపి కార్యకర్తలకు అప్పలంగా అప్పగిస్తున్నారు. 4 నెలల క్రితం 100 ఎకరాలకు రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేయడం ద్వారా కుంభకోణానికి తెరలేపారు. దేవాదయశాకకు చెందిన సర్వే నెంబర్‌ 667/3లో నవరత్నాలలో ప్లాట్ల కేటాయిస్తూ రెవెన్యూ అధికారులు భూమిని ఆక్రమించుకున్నారు. ఇదే భూమిలో 1987లో సాయినగర్‌ రియల్‌ఎస్టేట్‌ వారు ప్లాట్లు ప్రజలకు రిజస్టర్‌ చేసివున్నారు. భూమి హక్కుల కొరకు దేవాదయ, సాయినగర్‌ యాజమాన్యం మధ్య హైకోర్టులో వ్యాజ్యం నడుస్తూవుంది. వివాధస్పదభూమిలోనే నవరత్నాలకు ప్లాట్లు కేటాయించి సరికొత్త వివాదాలకు వైసిపి ప్రభుత్వం తెరలేపింది. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అన్యక్రాంతం చేసి దేవదాయశాఖకు ఆస్తులు కోల్పోయేలా చేస్తున్నారు. నవరత్నాల ప్లాట్లు కోసం హిందూశ్మశానం నుండే దారిని నిర్మించుకున్నారు. నవరత్నాలలో అర్హులుతో పాటు అనేక మంది అర్హతలేని వైసిపి కార్యకర్తలు వున్నారు. దేవాదయశాఖ భూములలో నవరత్నాల ప్లాట్లు కేటాయింపు చట్టవ్యతిరేకం. అనివార్యంగా ప్రభుత్వం ఈ భూములలో నవరత్నాల ప్లాట్లు కేటాయించదలిస్తే కోట్ల రూపాయల విలువచేసే భూమి విలువను రెవెన్యూ అధికారులు దేవదాయశాఖకు ముందస్తుగా డిపాజిట్‌ చేయ్యాలని డిమాండ్‌ చేస్తున్నాము. 100ఎకరాల ఆలయభూములు అవినీతి కుంభకోణాల ద్వారా పట్టాలు మంజూరుపై సింగిల్‌ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని మిడతల రమేష్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమన శ్యాంబాబు, సాయిశ్రీనివాసులు, బండారు సురేష్‌, చింతగింజల సుబ్రహ్మణ్యం, సిహెచ్‌.వెంకటరమణ, మారంరెడ్డి రాధారెడ్డి, రాంబాబు తదితరులు వున్నారు.