నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన సచివాలయం సిబ్బంది.

నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట, తడ మరియు దొరవారిసత్రం మండలంలోని గ్రామ సచివాలయ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలకు దిగారు. సచివాలయంలోని ఉద్యోగులు విధులు, బయోమెట్రిక్ హాజరు బహిష్కరించి ఆయా మండల కేంద్రంలోని మండల కార్యాలయం వద్దకు చేరుకున్నారు.గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయా మండల పరిషత్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకు, మండల తహశీలదారుకు వినతి పత్రం అందజేశారు.దీంతో అన్ని సచివాలయాల్లో సేవను నిలిచిపోవడంతో ప్రజలు వెతలు పడుతున్నారు.