కోట, జనవరి 03, (రవికిరణాలు) : క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా చిట్టమూరు ఎంఈఓ ఆఫీస్ లో నిర్వహించారు. ఎంఈఓ బి.వి.కృష్ణ ఆధ్వర్యంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఆర్ఓ రవికుమార్ మాట్లాడుతూ ఆధునిక భారతదేశ చరిత్రలో సావిత్రిబాయి ఒక ధ్రువతార అని అన్నారు. ఒక మహిళ ఆలోచిస్తే భారతదేశంలోని మహిళలందరికీ విద్యను అందించింది. ఒక మహిళ అడుగువేస్తే కోట్లమంది బానిస సంకెళ్లు తెంచి పాడింది అట్టడుగు వర్గాలకు, మహిళలకు చదువు సంపద నిరాకరించబడిన దేశంలో ఆనాటి కుటుంబాలను మానువాడ సాంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి మహిళకు పాఠశాలను ప్రారంభించి తొలి మహిళా ఉపాధ్యాయులుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అనంతరం బి.వి.కృష్ణయ్య మాట్లాడుతూ నూతన సమాజం నిర్మించడం కోసం ఆమె చేసిన త్యాగం అసాధారణమైనది అని అన్నారు. మహిళా ఉపాధ్యాయురాలు అందరూ ఆమెను స్ఫూర్తిగాతీసుకోవాలని అన్నారు. చిట్టమూరు మండలంలోని నలుగురు ఉపాధ్యాయులను "భవాని"రాధా" పద్మావతి"చెంగాళమ్మలను ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సన్మానించారు. ఉపాధ్యాయులు వేణుగోపాల్ సార్"మొలకల పూడి హెచ్ఎం" చంద్రశేఖర్" చిట్టమూరు ఉపాధ్యాయురాలు సుభాషిని" ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.