నెల్లూరు, జనవరి 27, (రవికిరణాలు) : నగర పాలక సంస్థకు విచ్చేసే వృద్ధులు, మహిళల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత వాహన సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాహన సేవలను కమిషనర్ పివివిస్ మూర్తి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కార్యాలయ ప్రధాన ద్వారం నుంచి ప్రాంగణం వరకు నిరంతరం నడిచేలా వాహనాన్ని సిద్ధం చేసి ప్రత్యేకంగా ఒక డ్రైవరును కేటాయించారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వృద్ధులు ఉచిత వాహన సౌకర్యాన్ని పొంది సంతృప్తిని వెలిబుచ్చారు.