నెల్లూరు జిల్లా మర్రిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శివ జ్యోతి ఆధ్వర్యంలో చదువుల తల్లి సరస్వతీదేవికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు  సరస్వతీ దేవికి నారికేళము సమర్పించి చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10తరగతి పరీక్షలు ఆసన్నాం అవుతున్న సందర్భంగా ఈ పూజలు నిర్వహించడం జరుగుతుందని శివజ్యోతి  తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థికి చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయని, ఆ సరస్వతి దేవి ఆశీస్సులు విద్యార్థులకు ఎల్లవేళలా తోడుగా ఉంటూ  ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, భవిష్యత్తు ఆయన కోరారు. అంతేకాకుండా విద్యార్థులు అట పాటలతో హుషారుగా, కేరింతలు కొడుతూ తల్లితండ్రులకు తాము చదువులోనే కాకుండా అన్ని రంగాలలో రాణిస్తామని ఈ సాంస్కృతిక కార్యక్రమం ద్వారా తెలిపారు. శివజ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు అందరు అన్ని రంగాలలో ముందుకు సాగాలని, క్రమశిక్షణతో నడవాలని,  పెద్దలను గౌరవించి రాబోయే భవిష్యత్తు తరాలు మీరే కావాలని ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దెదించి తెలిపారు.. 
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..