జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు.


                  

నెల్లూరుజిల్లా. దొరవారిసత్రం: దొరవారిసత్రం మండలంలోని మేలనత్తూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా  క్రికెట్ టోర్నమెంటు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. క్రికెట్ పోటీలలో గెలుపొందినవారికి మొదటి బహుమతి రూ. 5116 , రెండో బహుమతి రూ.2500 జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బురకాల లీలా మోహన్  అందజేశారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రైస్ కుక్కర్ ,రెండో బహుమతి నాన్ స్టిక్ పెనుము ,మూడో బహుమతి శారీని సూళ్లూరుపేట నియోజకవర్గం మహిళా నాయకురాలు బురకాల గీతాంజలి,సర్పంచ్ మణేయ్యలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్రీడలు శారీరక ,మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు.అలాగే ముగ్గుల పోటీలు మన సంస్కృతి,సాంప్రదాయాలను  తెలియజేస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో  జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.