ఎన్నికలు సమీపిస్తున్నందున రౌడీ షీటర్స్ కు కౌన్సెలింగ్ వారానికి రెండు సార్లు ఇవ్వండి 

నగరంలో ఎల్ల వేళలా విజబుల్ పోలీసింగ్, గస్తీని ఏర్పాటు చేయాలి 

నగరంలో ఈవ్ టీజింగ్ ను పూర్తిగా నిర్మూలించాలి 

సిసి కెమెరాలను అన్ని జంక్షన్స్, అపార్ట్ మెంట్ లలో ఖచ్చితంగా ఏర్పాటు, కంట్రోల్ రూం కి అనుసంధానం తప్పనిసరి

జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ జిల్లా పోలీసు కార్యాలయం నందు నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ అధికారులతో జరిగిన నేర సమీక్షా సమావేశంలో పై ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో విజబుల్ పోలీసింగ్ ఉండాలని,రౌడీ షీటర్స్ పై నిఘా పెంచాలి, వారానికి రెండు సార్లు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి, నగరంలో ఈవ్ టీజింగ్ పై కఠినంగా వ్యవహరించాలని, పూర్తిగా నిర్మూలించాలని, సిసి కెమెరాలను మీ పరిధిలోని ముఖ్యమైన కూడలి లలో మరియు అపార్ట్ మెంట్ లలో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని, సిసిటిఎన్‌ఎస్‌ లో ప్రతి కేసు వివరాలు పూర్తిగా అప్డేట్ చేసి ఉండాలని, పాత కేసులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి
పైనలైజ్ చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ పై అలాగే సైబర్ మరియు ఆర్థికపరమైన నేరాలతో పాటు వివిధ రకాల నేరాలకు తీసుకోవాల్సిన చర్యల గురించి, ప్రధాన కూడలిలలో సిసిటివి పుటేజి లను ఏర్పాటు చేసి అన్నింటినీ కంట్రోల్ రూం కి అనుసంధానించాలని తద్వారా కేసుల పరిష్కారం సులభతరమని, సిసిటిఎన్‌ఎస్‌ లో ప్రతి కేసు వివరాలు, వాటి పురోగతి వివరాలు పూర్తిగా నింపాలని హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న ముఖ్యమైన రౌడీషీటర్లు హాజరు, గైర్హాజరు అలాగే ప్రస్తుత జీవన విధానం
ప్రవర్తన మరియు పోలీసు నిఘా తీసుకోవాల్సిన చర్యలపై, నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ లో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను సర్కిల్ వారీగా ఆయన సమీక్షించారు. ప్రాపర్టీ క్రైమ్స్, చీటింగ్ నేరాలపై మరియు ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్‌బిడబ్ల్యు ఎగ్జిక్యూషన్ మొదలగు అంశాలపై సమీక్షించి, నగరంలో రాత్రి వేళలో నిర్వహించే గస్తీని పటిష్టం చేయాలని, కచ్చితంగా విజబుల్ పోలీసింగ్ ఉండాలని ఆదేశించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో యస్పితో పాటు నెల్లూరు టౌన్ డియస్పి జె.శ్రీనివాస రెడ్డి, ప్రొబేషనరి డిఎస్పి షేక్.షాను, డి.సి.ఆర్.బి. ఇన్స్పెక్టర్, చిన్న బజార్, నవాబ్ పేట, సంతపేట, దర్గామిట్ట, వేదాయపాలెం, బాలాజీ నగర్ పి.యస్.ల ఎస్‌హెచ్‌ఓ లు, ఎస్సై సిబ్బంది హాజరుగా ఉన్నారు.