నెల్లూరు, జనవరి 20, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ సోధన్ నగర్ లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నుడా వైస్ ఛైర్మెన్ బాబిరెడ్డి పర్యటించారు. ఆర్.టి.సి.యాజమాన్యం, కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి ఆర్.టి.సి. రీజినల్ మేనేజర్, కార్పొరేషన్ అధికారులను రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోరారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంలో నెల్లూరు రూరల్ నియోజవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజవర్గంగా తీర్చిదిద్దుతామని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు.