నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17 వ డివిజన్, బాబా నగర్ లో 2 కోట్ల రూపాయలతో వ్యయంతో 33/11కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయ కుమార్ రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు. 2 కోట్ల రూపాయలతో వ్యయంతో విద్యుత్ సబ్ స్టేషన్ ను  వేగవంతంగా పూర్తి చేసిన అధికారులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలపక్షాన అభినందించారు. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ వలన వడ్డిపాలెం, గుండ్లపాలెం, కె.ఎమ్.పాలెం, పార్థసారధి నగర్, బాబా నగర్ ప్రాంతాలలో కరెంటు అసౌకర్యం కలగకుండా నాణ్యమైన కరెంటు ప్రజలందరికీ అందుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.17వ డివిజన్లో 2 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు డ్రైన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.