నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 12 మందికి 10 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందజేశారు.ఇప్పటికే 70 మందికి 50 లక్షల రూపాయల నిధులను అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలకోసం తీసుకొన్న చర్యలు ఎంతో హర్షనీయమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు.