నెల్లూరు, డిసెంబర్‌ 27, (రవికిరణాలు) : నూతన సంవత్సరంలో తనకు శుభాకాంక్షలు చెప్పే పేరుతో ఎలాంటి ఆడంబరాలకు పోకుండా ఫ్లెక్సీలకు, బొకేలకు చేసే ఖర్చును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను గత ఏడాది నూతన సంవత్సర వేడుకలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏ సంప్రదాయాలు పాటించానో ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా అదే సంప్రదాయాలను పాటిస్తానని అని చెప్పారు. ముఖ్యంగా తన నియోజకవర్గమైననెల్లూరు రూరల్ లో వైసీపీ అభిమానులు ఫ్లెక్సీల పేరుతో
డబ్బు వృధా వద్దని సూచిస్తూ వారంతానూతన సంవత్సరం సందర్భంగా సేవా కార్యక్రమాలు జిల్లా అంతా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.పేదలు, నిరుపేదలను ఆదుకునేందుకు వారి శక్తి మేర చేయూత ఇవ్వాలని ఆయన కోరారు. ఫ్లెక్సీలు,పూల బొకేల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. వైసిపి అభిమానులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తన సూచనలను పాటిస్తారని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సమావేశంలో రూరల్ నియోజకవర్గ కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసిపి నాయకులు తాటి వెంకటేశ్వర్లు, శివాచారి తదితరులు పాల్గొన్నారు.