రవికిరణాలు నెల్లూరు : 

 నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 39వ డివిజన్ కు చెందిన యువ నాయకులు జమీర్ వీరి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

 పార్టీలో కొత్తగా చేరినవాళ్ళు,మొదటి నుండి పార్టీకోసం కష్టం చేసిన వారు అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలని ప్రతీ గడపకూ చేరేలా పని చేయాలి. రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరిని కలుపుకునిపోతూ అభివృద్ధి మరియు సంక్షేమమే అజెండాగా ముందుకు సాగుతాం .  రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిండి సురేష్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.