నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్, బుజబుజ నెల్లూరు లో 4 కోట్ల రూపాయల వ్యయంతో శ్మశానవాటిక, సీసీ రోడ్డు, సర్వీస్ రోడ్డు పనులకు శంకుస్తాపనలు చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 
 నా చిరకాలకోరికైనటువంటి బుజబుజ నెల్లూరు స్మశానవాటికను శంకుస్థాపన చేసి, 2 నెలలో పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 అనేక సంవత్సరాలుగా స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్న ఈ సర్వీస్ రోడ్డు కు శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉంది. మరో 10 రోజులలో పనులు పూర్తిచేసి, ఈ సర్వీస్ రోడ్డును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

 ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.