జిల్లాలో జరుగుతున్న సమగ్రాభివృద్ధి ప్రణాళికా పనులపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖల సాంకేతిక విభాగ అధికారులతో ఓ.ఎస్.డి పెంచల రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక డైకాస్ రోడ్డులోని మంత్రి నగర క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంజూరైన అభివృద్ధి పనులతో పాటు ప్రస్తుతం పూర్తయే దిశగా కొనసాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త పనులకు సంభందించిన మంజూరు ఉత్తర్వులు ఏ కారణాలతో పెండింగులో ఉన్నాయో విచారించాలని అధికారులకు సూచించారు. సమగ్రాభివృద్ధి పనులకై గౌరవ మంత్రివర్యులు ప్రకటించిన హామీల అమలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా ఆయా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఓ.ఎస్.డి ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
-