నెల్లూరు, జనవరి 18, (రవికిరణాలు) : ఈనెల 26వ తేదీన నగరంలోని పోలీసు పేరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఎమ్.వి.శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టరు వారి క్యాంపు కార్యాలయంలో సంయుక్త కలెక్టర్లు డా. వి.వినోద్ కుమార్, కె.కమలకుమారి, డి.ఆర్.ఓ.మల్లిఖార్జునలతో కలసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటలకు నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అందరూ సంసిద్ధం కావాలన్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. మైదానం ప్రాంగణమంతా పరిశుభ్రంగా వుండాలని, ఆహుతులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంచినీటి వసతి కల్పించాలన్నారు. ప్రథమ చికిత్స కోసం వైద్యశిబి రం, ప్రమాదాల నివారణకు అగ్నిమాపక యంత్రం సిద్ధంగా వుండాలన్నారు. ప్రదర్శనశాలలు ముఖ్యంగా నవశకం,గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రతిబింబించే విధంగా ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించే శకటాలు ప్రదర్శించాలన్నారు. అధి కారులంతా సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. విద్యార్థులను వేడుకలకు పద్ధతి ప్రకారం తీసుకుని రావడంతోపాటు వారిని తిరిగి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే బాధ్యత తీసుకోవాలన్నారు. దేశభక్తి, జాతీయ
సమగ్రతను చాటి చెప్పే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలన్నారు. ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఎ., ఐ.సి.డి.ఎస్. పి.డి.లు శీనా నాయక్, సుధాభారతి, ఆర్.డి.ఓ. హుస్సేన్ సా హెబ్, డి.టి.సి. సుబ్బారావు, డి.ఇ.ఓ. జనార్ధనాచార్యులు, ఎస్.ఎస్. పి.ఓ. బ్రహ్మానంద రెడ్డి, డి.ఎం.అండ్. హెచ్.ఓ. డా.రాజ్యలక్ష్మి, డి.ఎస్.ఓ. బాలకృష్ణారావు, డి.పి.ఓ. ధనలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ డి.డి. జీవ పుత్ర కుమార్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.