వెల్లంటి, జనవరి 26, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ మండలం జెడ్పి ఉన్నత పాఠశాలలో పాతవెల్లంటి నందు నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు దొడ్ల జయరామనాయుడు జాతీయ జెండా ఎగురవేశారు. జండా వందనం స్వీకరించారు.పాఠశాల విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు.ముఖ్య అతిధులుగా విశ్రాంత ఎమ్‌ఈఓ కొండయ్య, మార్కెటింగ్ డైరెక్టర్ మురళి రెడ్డి, మాజీ ఎమ్‌పిటిసి నాయకులు పాదర్తి సుధాకర్, కొత్త వెల్లంటి వైసిపి నాయకులు పరందామరెడ్డి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వణ్ణం రవి, గ్రామ పెద్దలు, పేరెంట్స్,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ రకాల పోటీలలో విజేతలకు బహుమతులు,స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.