ముస్లిం జేఏసీ నాయకులతో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి


 ఎన్ ఆర్ సి , ఎన్ పి ఆర్, సి ఏ ఏ ల పై నిరసన ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరు ఎంపీ ని కలిసిన జేఏసీ నాయకులకు ఆయన హామీ ఇచ్చారు. నేను ఈ అంశాలపై పార్లమెంట్లో ఓటింగ్ జరిగేటప్పుడు లేనని, హైదరాబాదులో ఉన్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 60 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలో హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంగా ఉన్నారని తెలిపారు. ఇదే ఐక్యత, సోదరభావం కొనసాగాలన్న దే తమ అభిమతమని స్పష్టం చేశారు. ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ , సి ఏ ఏ లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలనే డిమాండ్ ను ఆయనకు చేర వేస్తానని స్పష్టం చేశారు. ఇదివరకే మా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దీనికి వ్యతిరేకమని తన నిర్ణయాన్ని తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ మీ కోరిక మేరకు ఆయనకు మరొక్కసారి విషయాన్ని తెలియజేస్తానని చెప్పారు. అంతకుముందు జేఏసీ నాయకులు మౌలానా ఇలియాస్, ఆసిఫ్, జాకీర్, ఫయాజ్, జియావుల్ హక్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకరులకు కూడా మరొకసారి తెలియజేశారు.