ఆత్మకూరు, జనవరి 03, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని మర్రిపాడులో బాలుపల్లి నూతనంగా నిర్మించిన మసీద్ ను అట్టహాసముగా ప్రారంభించిన మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహనరెడ్డి. వివరాలలోకి వెళ్తే.. మర్రిపాడు బాలుపల్లిలో నిర్మించిన మసీద్ మండలంలోనే పెద్దదని ముస్లిం సోదరులు అందరు ఎంతో కష్టపడి దృఢసంకల్పంతో మసీద్ నిర్మాణానికి పూనుకున్నారని, ముస్లింల యొక్క కృషి ఎంతో ఉందని ఒక్కరిని కాకుండా అందరు మసీద్ నిర్మాణానికి పాలుపంచుకోవడం శుభపరిణామం అని మసీద్ కమిటీ సభ్యులను, పెద్దలను మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహనరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్సార్సీపీ కన్వీనర్ గంగవరపు శ్రీనువాసులు నాయుడు, మాధవరెడ్డి, ముస్లిం మతపెద్దలు,మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.