31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా పుత్తూరులో నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా బైక్ నడిపారు. వేగంకన్నా ప్రాణం మిన్న అంటూ వాహనదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నంగా ద్విచక్ర వాహనాలతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా రోజా విజ్ఞప్తి చేశారు.