కుంకుమ అలంకరణలో పుట్టాలమ్మ.... వాకాడు... మండల పరిధిలోని రావిగుంట పాలెం  పంచాయతీలోని తీపాలపూడి గ్రామంలో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ పుట్టాలమ్మ భక్తులకు కుంకుమ అలంకరణలో దర్శనమిచ్చింది. వాకాడు మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వైకాపా నాయకులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి ఆయన సోదరుడు దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి  దంపతులు వ్యవహరించారు. పుట్టాలమ్మ కు ప్రత్యేక కుంకుమ అలంకరణలతో పాటు విశేష పూజలు నిర్వహించి ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ తోపాటు దువ్వూరు సోదరులు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ అజిత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఈ ఆలయంలో జరపడం ఆనవాయితీ. ఈ ప్రాంత ప్రజలు అన్ని విధాల సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని రైతులకు పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.