ఈ రొజు కావలి బార్ అసోసియేషన్ లో  కావలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారైన శ్రీమతి ఎస్ శైలజగారు ఆదోని సబ్ కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జి గా ప్రమోషన్ పొందినందుకు గాను వారికి కావలి బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమమునకు కావలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాటా సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ శ్రీమతి శైలజ గారు ఒక మధ్య తరగతి కుటుంబం లో జన్మించి ఎంతో కష్టపడి చదివి ఒక న్యాయమూర్తి గా ఉన్నతమైన పదవిని అలకరించారు., వారు అనేక మంచి మంచి తీర్పులను ఇచ్చారు. అలాగే వారు ఇంకా ఉన్నతమైన పదవులను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుతూ, వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళా న్యాయవాది కూడా న్యాయమూర్తిగా పదవులు పొందాలని తెలియజేసారు. అలాగే మిగతా న్యాయవాదులు కూడా మాట్లాడుతూ వీరు న్యాయ వ్యవస్థ కు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమమునకు కావలి సీనియర్ సివిల్ జడ్జి శ్రీ పీ. పాండు రంగారెడ్డి గారు, స్పెషల్ మేజిస్ట్రేట్ పరుసురాం గారు, కావలి బార్ అసోసియేషన్ సెక్రటరీ ఆర్. నాగేంద్రబాబు గారు, జాయింట్ సెక్రటరీ కె. బాలాజీ గారు, వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ గారు మరియు న్యాయవాదులు గద్దె మాల్యాద్రి గారు, ఏ. ప్రసాద్ రెడ్డి గారు, కొమరా చక్రపాణి గారు, కలీం అహ్మద్ రోజ్ దార్ గారు, డి. వేణు గోపాల్ రెడ్డి గారు, పువ్వాడ ప్రసాద్ గారు, జి. రాజేంద్ర వరప్రసాద్ గారు, కెన్నడి గారు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.