- ముగింపు వార్షిక సమీకరణలో యస్పి
సాయుధ బలగాలు ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ తో ఉండాలి, దిన చర్యలో కొనసాగించాలి- జిల్లా యస్పి 
- పరేడ్ చాలా అద్భుతంగా ఉంది 
- తీర్చిదిద్దిన ఎ.ఆర్ అధికారులకు అభినందన
నెల్లూరు, జనవరి 30, (రవికిరణాలు) : ఆకర్షణీయంగా అలంకరించిన పోలీసు కవాతు మైదానంలో, ఆహ్లాదకరమైన కరమైన వాతావరణంలో, బ్యాండ్ పార్టీ వాయిద్యాల మధ్య సాయుధ బలగాల కనువిందైన కవాతును జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ వీక్షిస్తూ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం 2 వారాల వార్షిక సమీకరణ ముగింపు కార్యక్రమంలో జిల్లా ఏఆర్‌ ఫోర్స్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి జిల్లా యస్పి పై వ్యాఖ్యలు చేసినారు. 17.01.2020 నుండి జరిగిన యాన్వల్ మొబలైజేషన్ ఈ రోజుతో విజయవంతంగా ముగిసిన సందర్భంగా యస్పి మాట్లాడుతూ జిల్లాలో పలు కీలక సేవలు అందించే జిల్లా సాయుధ దళం సంక్లిష్ట విభాగం
అయినందున వృత్తిపరమైన నైపుణ్యాలు ఇంకా మెరుగుపరుచుకోవాలని, పెరేడ్ ను అద్భుతంగా నిర్వహించిన ఆర్‌ఐ అడ్మిన్ ని, ఏఆర్‌ సిబ్బందిని మరియు అధికారులను అభినందించారు. ఈ శిక్షణలో అలవడిన ఉన్నత స్థాయి శారీరక ప్రమాణాలు, మానసిక సమతుల్యత సంవత్సరం పాటు శారీరక ఫిట్ నెస్ స్థాయిని కొనసాగించాలని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలను ఎలా హ్యాండిల్ చేయాలి, పైరింగ్ ప్రాక్టీస్, డ్రిల్, మార్చ్ ఫాస్ట్, మాబ్ కంట్రోల్, విఐపి ఎస్కార్ట్, పిఎస్‌ఓ, బందోబస్తి మొదలగు అన్ని అంశాలలో శ్రద్ధ పెట్టి నేర్చుకున్న ట్రైనింగ్ లోని నైపుణ్యాలను జీవితాంతం గుర్తుంచుకొని, ఎటువంటి మచ్చ లేకుండా భాధ్యతగా ఉద్యోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యస్పి తో పాటు అడిషనల్ యస్.పి. (క్రైమ్స్) పి.మనోహర్ రావు, అడిషనల్ యస్పి(ఎ.ఆర్) యస్.వీరభద్రుడు, యస్.బి. డియస్పి యన్.కోటా రెడ్డి,
డియస్పి(ఎ.ఆర్) రవీంద్ర రెడ్డి, ఆర్‌ఐ (అడ్మిన్) మౌలాలుద్దిన్, ఆర్‌ఐ (వెల్ఫేర్) చంద్ర మోహన్, యస్.బి. సి.ఐ. శ్రీనివాసులు రెడ్డి, దర్గామిట్ట సి.ఐ. యం.నాగేశ్వరమ్మ, ఆర్‌ఎస్‌ఐ సిబ్బంది పాల్గొన్నారు.