గుంటూరు జిల్లాకుల ధ్రువీకరణ పత్రం లో నాయకుల ఫోటో పై కోర్టులో పిటిషన్...

ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బొమ్మ ముద్రించటం చట్టవిరుద్ధం అని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన గుంటూరు జిల్లా వేమూరు కు చెందిన జడ రవీంద్రబాబు.. శాశ్వతంగా ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాల పై రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించడాన్ని తీవ్రంగా ఆక్షేపించిన పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.. రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించడం సుప్రీంకోర్టు తీర్పు.. కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్ ఆర్డర్స్ కి.. వ్యతిరేకమన్న పిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్.. పిటిషనర్ తనకున్న అభ్యంతరాలను అధికారులకి వారం రోజుల్లో రాతపూర్వకంగా తెలియజేయాలని ఆదేశం.. ఆరు వారాల్లో అధికారులు ముఖ్యమంత్రి చిత్రపటం తొలగించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.