ప్రజలకు ఆదాయ శాతం పెరగలేదు...బతుకుచిత్రం మారలేదు... 

నిత్యావసరాల పై మాత్రం 80 శాతం పెంచేశారు...

సామాన్యుడికి గుదిబండలా నిత్యావసర సరుకుల ధరలు... 

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి...

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రానికి దరిద్రం పట్టింది....


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జి అబ్ధుల్ అజీజ్,నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ నెల్లూరు విఆర్సి సెంటర్ లో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదల ద్రోహి వైయస్ జగన్ అంటూ పెద్ద ఎత్తున నెల్లూరు నగరంలో ప్రదర్శన నిర్వహించారు.  

ఎన్నికలకు ముందు అనేక మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కారని టిడిపి నెల్లూరు పార్లమెంటు సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడిందన్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువులను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందన్నారు.పాలన చేతకాకపోతే వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన నిత్యావసర సరుకుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తేవాలనీ అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. దేశంలో రైతు ఆత్మహత్య స్థానంలో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందనీ ఇది వైసీపీ పాలనలో సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవనీ, వినియోగదారులకు మాత్రం అందని రీతిలో నిత్యావసర సరుకుల ధరలు ఉన్నాయని నెల్లూరు పార్లమెంటు ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి టిడిపి హయాంలో 50 60 రూపాయల లోపు ఉన్న నిత్యవసర సరుకులు నేడు వైసిపి అరాచక పాలన లో 150 నుండి 200 వరకు చేరుకున్నాయని అజీజ్ ధ్వజమెత్తారు. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు చేరిపోయాయి కొనుక్కోలేని స్థితికి చేరుకున్నాయని అని మండిపడ్డారు. వైసీపీ పాలన బెదిరింపులు అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటిన సామాన్యుడి బతుకు చిత్రంలో మాత్రం మార్పు రావడం లేదు నాడు చంద్రబాబు నాయుడు హయాంలో సామాన్యుడి ఆదాయం ఎంత ఉందో అంతే ఉందని అజిత్ తెలిపారు. సామాన్యుడి ఆదాయం పెరగకపోగా ధరలు మాత్రం వారికి గుదిబండలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

 రెండు వేల కోట్లు కూడబెట్టిన మంత్రి అనిల్ పండుగ సమయంలో ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదనీ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చే ప్రజలు మిగతా సమయంలో ఎందుకు గుర్తుకురారు అని మండిపడ్డారు. ఇసుక నుండి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేద వారి పై పెను భారాన్ని మోపుతున్నారు అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రన్న కానుక తో పేదవారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసేవారనీ అన్నారు. దానిని వైసీపీ ప్రభుత్వం కొనసాగించకుండా పేదవాడికి పండుగ లేకుండా చేసిందని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి సంక్రాంతి కానుకలు అందించక ప్రజలను పండుగ జరుపుకొని కుండా వైసీపీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంత్రి అనిల్ వారి బాబాయ్ కుమార్ యాదవ్ వేల కోట్ల అవినీతి సొమ్మును కూడబెట్టారు 9 10 కోట్లతో ఇల్లు నిర్మించుకుని వాళ్ళు సంతోషంగా ఉన్నారని కానీ ప్రజలను మాత్రం గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. కానీ పండుగ సమయంలో పిండివంటలు చేసుకునేందుకు పేదవారు నూనె కొనుక్కోలేని పరిస్థితి కి ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆగ్రహించారు. ఎన్నికల ముందు ఒక అవకాశం ఇస్తే తానేంటో చూపిస్తానని జగన్మోహన్రెడ్డి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడని ఆరోపించారు. ఇకనైనా జగన్మోహన్రెడ్డి మొండితనాన్ని ఆపి ప్రజాగ్రహానికి గురికాక ముందే పదవి నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మరియు నగర నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, వార్డ్ అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.