చిట్టమూరు మండలంలోని 12 ఎంపిటిసి స్థానాలకు జరిగిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమర్నాథ్ రెడ్డి అభ్యర్ధుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.. రాష్ట్ర అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తుంది.. నామినేషన్ కు చివరిరోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఒక్కసారిగా నామినేషన్లు కు రావడంతో సమయం సరిపోక 7 గంటలకు వరకు జరిగిన ఈ నామినేషన్లు ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.. మండలంలోని 12 స్థానాలకు 81 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు..