నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి


ఆరోగ్యశ్రీ వర్తించని రోగులకు ఆపన్న హస్తం అందించేందుకు సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సహాయాన్ని సీఎం జగన్  అంద జేస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి తెలిపారు. సీఎం సహాయనిధి ద్వారా 14 మందికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని అందజేశామని పేర్కొన్నారు. అందరికీ స్వస్థత చేకూర్చి సమాజం లో శాంతి సామరస్యాలు వెళ్లి విరియాలనేదే తమ  ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఇది మున్ముందు కూడా కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ  డైరీ చైర్మన్ రంగారెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,  బట్టేపాటి నరేంద్ర, పాముల హరి ప్రసాద్, అబూబకర్, జనార్దన్రెడ్డి ,నరసింహారావు, అవినాష్ ,మధు, లాయర్ సుబ్బారెడ్డి, చేజర్ల సుబ్బారెడ్డి నెల్లూరు ఝాన్సీ   తదితరులు పాల్గొన్నారు.