రవికిరణాలు :

 తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారత్ బంద్ లో పాల్గొనీ విజయవంతం చేయండి...


- అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు


నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనీ అన్ని నియోజకవర్గాల్లో అఖిల పక్ష పార్టీలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మద్దతు ప్రకటించారు... 


తెలుగుదేశం పార్టీ శ్రేణులు బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు షేక్. అబ్దుల్ అజీజ్ ఒక ప్రకటనలో తెలిపారు. 


దేశ రక్షణ, వ్యవసాయ రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మిక సంఘాల హక్కులకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న బందును సంపూర్ణంగా విజయవంతం చేయవలసిన అవసరం ఉందని అన్నారు..


వ్యాపార సంస్థలు, కార్మికులు, చిల్లర వ్యాపారులు, అసంఘటిత కార్మికులు, బంద్ లో పాల్గొనాలని, కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు రైతులు కర్షకులు అన్ని వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని అబ్దుల్ అజీజ్ తెలిపారు. 


కనీస మద్దతు ధర కల్పించే వ్యవస్థను, ప్రభుత్వ ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థను ఒక పద్ధతిలో ధ్వంసం చేసే లక్ష్యంతోనే బిజెపి ప్రభుత్వం ఈ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని, భారతదేశంలో 81 కోట్ల మంది ఉపయోగించుకునే ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా ధ్వంసం చేయబోతోందని అన్నారు..


కాబట్టి ఈ వ్యవసాయ చట్టాలు కేవలం రైతులకు మాత్రమే కాక ప్రజలందరికీ వ్యతిరేకమైనవని అబ్దుల్ అజీజ్ అన్నారు...


వ్యవసాయ చట్టాలు రాజ్యాంగబద్ధం కావు. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండాల్సిన అంశాలు అన్నారు..


కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా అగౌరవ పరుస్తు సమాఖ్య నిబంధనలను తుంగలో తొక్కి రాష్ట్రాల హక్కులను కాల రాశి పార్లమెంటులో చట్టం చేసిందని అన్నారు..


ఈ మూడు వ్యవసాయ చట్టాలు రద్దును సాధించేవరకు పోరాటాలు సాగించవలసిన ఆవశ్యకత ఉందని అబ్దుల్ అజీజ్ తెలిపారు...