సేవ చేయడమే మా లక్ష్యం


చిల్లకూరు మండలం చేడిమాల గ్రామంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ 5.వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాల పుస్తకాన్ని ఆవిష్కరించారు.అనంతరం వికలాంగులకు ట్రై సైకిళ్ళు, పేదలకు బట్టల పంపిణీ కార్యమాలు జరిగాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు సేవలు అందించడమే రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని, సేవ చేయడంలో పొందే సంతోషం మరెక్కడా దొరకదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు పిచ్చయ్యనాయుడు కో ఫౌండర్ శ్రీమతి శిరీష,కార్యదర్శి రామయ్యనాయుడు, ట్రస్ట్ సభ్యులు బాబు, ప్రధానోపాధ్యాయులు రమణకుమార్, దశరథరామిరెడ్డి,మంజులాదేవి వెంకటకృష్ణారెడ్డి, రాజేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.